వరంగల్ మహా;
వరంగల్ తూర్పు నియోజకవర్గం 27వ డివిజన్ అబ్బనికుంట ప్రాంతంలోని యాకూబ్ పుర నల్ల పోచమ్మ ఆలయం శ్రావణమాస పోచమ్మ బోనాలు స్థానిక కార్పొరేటర్ చింతాకుల అనిల్ కుమార్, సీనియర్ నాయకులు చింతాకుల సునీల్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ మాట్లాడుతూ శ్రీ నల్లపోచమ్మ తల్లి చల్లని తల్లికి అన్నింటినీ ఓర్చుకొని ప్రకృతి సిద్ధంగా ఎండా, వాన, చలి, మంచి ,చెడులను ఎదుర్కొని భక్తుల యొక్క ధర్మబద్ధమైన కోరికల్ని తీరుస్తూ కొలిచిన వారికి కొంగు బంగారమై ,అడిగిన వారికి అన్నీ తానై నిలిచి ఆశీర్వదిస్తున్నదని కార్పోరేటర్ అన్నారు. బోనాల పండుగ సందర్భంగా మహిళలకు డివిజన్ ప్రజలందరికీ పేరుపేరునా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుమ్మరి వంశస్థులు ,స్థానికులు అఖిల్, యుగేందర్, జయప్రకాష్, ధనుష్, వేణు ,శ్రీనివాస్ ,అశ్విన్ ,రాజు, రాజేష్ ,మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.








