Mahaa Daily Exclusive

  శ్రీ అభయాంజనేయ ఆలయానికి పంచలోహ విగ్రహాల బహుకరణ

Share

  • శ్రీ అభయాంజనేయ ఆలయానికి పంచలోహ విగ్రహాల బహుకరణ
  • రూ.1,07,116 విలువ చేసే పంచలోహ విగ్రహాలను బహూకరించిన గుగులోతు రవి(బెల్ రవి) దంపతులు

కారేపల్లి, మహా:
సింగరేణి మండల పరిధిలోని వెంకట్యతండా గ్రామంలో కొలువై ఉన్న శ్రీఅభయాంజనేయ స్వామి ఆలయానికి,భల్లునగర్ తండా గ్రామానికి చెందిన గుగులోత్ రవి దంపతులు రూ.1,07,116 రూపాయలు విలువ చేసే సీతారామ,లక్ష్మణ,ఆంజనేయ స్వామి పంచలోహ విగ్రహాలను వితరణగా అందజేశారు.దైవ కార్యక్రమాల్లో భాగంగా గ్రామస్థులు మూడు రోజుల నుండి ఘనంగా నిర్వహిస్తున్న ఆలయ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం పంచలోహాల విగ్రహాల దాత గుగులోత్ రవి (భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మేనేజర్) దంపతులు స్వామివారి కల్యాణం,ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొప్పగా ఘనంగా నిర్వహించిన దైవ కార్యక్రమంలో భాగస్వాములు అయినందుకు సంతోషంగా ఉన్నట్లు తెలిపారు.అనంతరం మాజీ ఎంపీపీ బానోత్ దేవ్లా నాయక్ మాట్లాడుతూ గ్రామంలో మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించిన దైవ కార్యక్రమాల ద్వారా వెంకట్యతండా గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో,పాడిపంటలతో వర్ధిల్లాలని శ్రీఅభయాంజనేయస్వామి వారిని కోరుకున్నట్లు తెలిపారు.దాతల సహకారంతో పాటు,గ్రామస్తుల సహకారం,యువత భాగస్వామ్యం ద్వారా ఈ దైవ కార్యక్రమం గొప్పగా నిర్వహించడం జరిగిందన్నారు.ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో సర్పంచ్ బానోత్ బుల్లి,మంగళం కంపెనీ ఎండీ గుగులోతు రాజేందర్,మాజీ సర్పంచులు,వెంకట్యతండా గ్రామస్తులు,ఉద్యోగస్తులు,యువత తదితరులు పాల్గొన్నారు.