- కేవైసీ పేరుతో కూలీల కుదింపుకు కుట్ర
- ఉపాధీ కూలీల ఈకేవైసీ గడువు పెంచాలి
కారేపల్లి, మహా : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధీ కూలీలకు కేవైసీ పేరుతో కూలీల సంఖ్య కుదింపు కు కుట్ర చేస్తుందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండెబోయిన నాగేశ్వరరావు విమర్శించారు. సోమవారం మాణిక్యారంలో ఉపాధి పని ప్రాంతాన్ని వ్యకాస నాయకులు సందర్శించి కూలీలతో మాట్లాడారు. ఈసందర్బంగా వ్యకాస నేత నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉపాధీ కూలీలు తప్పని సరిగా ఈకేవైసీ చేయించుకోవాలని గడువు పెట్టిందని గడవు 11వ తేదితో ముగిసిందన్నారు. ఈ కేవైసీ ప్రాధాన్యత తెలియక చాలా మంది కూలీలు కేవైసీ చేయించుకేలేదన్నారు. రాష్ట్రం వ్యాప్తం కేవైసీ చేయించుకోని వారి సంఖ్య 3 లక్షల పైగా ఉందన్నారు. వారందరు నష్టపోయే ప్రమాదం ఉందని ప్రభుత్వం కేవైసీ గడువు పెంచటంతో పాటు కేవైసీ ప్రాధాన్యతనపై చైతన్యం చేయాలన్నారు. రోజు వారి కూలీ రూ.307 ఇవాల్సి ఉండగా ప్రస్తుతం రూ.150 కూడా పడటం లేదన్నారు. పని ప్రదేశాలలో టెంట్, నీరు, మెడికల్ కిట్స్ కల్పించటం లేదన్నారు. కూలీలకు ప్రమాధ భీమా కేంద్రం ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్లతో ఈనెల 15న గ్రామీణ బంద్‌లో భాగంగా ఉపాధి బంద్, గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ధర్నా లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉపాధీ కూలీలు హక్కులు, పని దినాలు, కూలి పెరగాలంటే పోరాటాలకు మద్దతు తెల్పాలని కోరారు. ఈసంధర్బంగా కరపత్రాలను పంపిణి చేశారు. ఈకార్యక్రమంలో ఐద్వా వైరా డివిజన్ అధ్యక్షురాలు కే.ఉమావతి వ్యకాస నాయకుల పీ.నాగేశ్వరరావు, గోపాలు, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.








