- ఘనంగా ధ్వజస్తంభ, గ్రామదేవతల ప్రతిష్ట
- అన్నదానం ప్రారంభించిన అజ్మీర వీరన్న
కారేపల్లి, మహా : కారేపల్లి మండలం బీక్యాతండాలోని రామాలయం ధ్వజస్తంభం, గ్రామదేవతల ప్రతిష్ట ఉత్సవాలు గ్రామ పెద్దలు అజ్మీర బిచ్చ నాయక్, వాంకుడోత్ రాములు ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయంలో గణపతి పూజ, చండీ రుద్రహోమాలు, మహాలక్ష్మి హోమాలు, సహస్ర కుంకుమార్చన జలాధివాస, క్షీరాదివాస, ధాన్యాదివాస, పుష్పాదివాస, సయ్యాధివాసా కార్యక్రమాలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేద పండితులు బి వాసుదేవ శర్మ, బి.భరద్వాజ శర్మ, ఎన్.నాగేంద్రశర్మ, రోహిత్‌శర్మల తోపాటు పలువురు పూజారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామదేవతల విగ్రహాల ప్రతిష్ట అనంతరం పూర్ణాహుతి కార్యక్రమంతో ఉత్సవాలు ముగిశాయి. ఆలయ ప్రాంగణంలో కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాన్ని బీఆరఎస్ మండల మాజీ ప్రధాన కార్యదర్శి అజ్మీర వీరన్న ప్రారంభించారు.
Post Views: 253








