- సోషల్ మీడియాలో వేధింపులు
- పోలీసులకు ఫిర్యాదు చేసిన యాంకర్ విష్ణుప్రియ
హైదరాబాద్, మహా : సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురిచేసే ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా ప్రముఖ నటి, యాంకర్ విష్ణుప్రియ దీనికి బాధితురాలిగా మారారు. తనపై సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు తీవ్ర అభ్యంతరకరమైన, అసభ్యకరమైన పోస్టులు పెడుతూ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారంటూ ఆమె పోలీసులను ఆశ్రయించారు. గత కొన్ని రోజులుగా ఇన్‌స్టాగ్రామ్, ఇతర సామాజిక మాధ్యమాల్లో తనపై జరుగుతున్న ట్రోలింగ్, వ్యక్తిత్వ హననానికి సంబంధించిన వివరాలను విష్ణుప్రియ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఆమె మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తన గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
Post Views: 2








