Mahaa Daily Exclusive

  మదన్ లాల్ అడుగుజాడల్లో నా పయనం…

Share

  • మదన్ లాల్ అడుగుజాడల్లో నా పయనం
  • ప్రజాసేవకే ప్రత్యక్షంగా రాజకీయాలకు

కారేపల్లి, మహా : నాన్న మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్‌లాల్ అడుగుజాడల్లో పయనిస్తానని, ప్రజాసేవకు ప్రత్యక్ష్య రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్లు మాజీ దివగంత ఎమ్మెల్యే బానోత్ మదన్‌లాల్ తనయ బానోత్ మనీషాలక్ష్మి అన్నారు. బీఆరఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సందర్భంగా శనివారం కారేపల్లిలో జరిగిన బీఆరఎస్ కార్యకర్తల సమావేశంలో పాý£్గని మాట్లాడారు. ప్రజాశ్రేయస్సు పరితపించే మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్ భౌతికంగా లేక పోవటం తీరని లోటైనా కార్యకర్తలు ఆయన సూచించిన సేవా మార్గంలో నడుస్తూ ఆయన ఆశయాలు నెరవేరుద్దామన్నారు. వైరా నియోజకవర్గంలో త్వరలో అన్ని గ్రామాల్లో పర్యటించి ప్రజల బాగోగులను తెలుసుకుంటానని, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని తెలిపారు. తండ్రి సంపాదించిన మంచి పేరును నిలబెడుతూ, ప్రజాసేవలో వైరా నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామి ఇచ్చారు. బీఆరఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదుకు ప్రతి కార్యకర్త శక్తి వంచన లేకుండా పని చేయాలని, రాష్ట్రంలో బీఆరఎస్ పునర్‌వైభవం తీసుకవద్దామన్నారు. అంతకు ముందు కారేపల్లిలోని పెద్దమ్మతల్లి ఆలయం పూజలు నిర్వహించారు. ఉద్యమకారుడు అమరజీవి జడల వెంకటేశ్వర్లు ఇంటికి వెళ్ళి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు ఆర్పించారు. ఈకార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ వాంకుడోత్ జగన్, బీఆరఎస్ ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ బన్సీలాల్, నాయకులు షేక్ గౌసుద్దీన్, నాయకులు వెన్ను వెంకటేశ్వర్లు, డొంకెన రవీందర్, సోమందుల నాగరాజు, జడల కళ్యాణ్, పేర్ని వెంకటేశ్వర్లు, దారావత్ వికాస్, గుగులోత్ సక్రు, జర్పల హచ్చు, చింతల కృష్ణ, కోటేశ్వరరావు, వీరన్న తదితరులు పాల్గొన్నారు.