- పేదరాలి ఇంటికి సాయం
- ఔదార్యం చాటిన గుడిపుడి వెంకట్రావమ్మ ట్రస్ట్
కారేపల్లి, మహా: నిరుపేదరాలైన వృద్దురాలి ఇంటిని నిర్మించటానికి గుడిపుడి వెంకట్రావమ్మ ట్రస్ట్ ముందుకు వచ్చింది. కారేపల్లి మండలం గేటుకారేపల్లికి చెందిన నిరుపేద దళిత వృద్దురాలు కాకాటి కళావతి ఇల్లు లేక అవస్ధలు పడుతుంది. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిన కట్టించుకోని పరిస్ధితి ఉంది. విషయం తెలుసుకున్న గుడిపుడి వెంకట్రావమ్మ ట్రస్ట్ చైర్మన్ గుడిపుడి తిరుమలరావు వెంటనే వృద్దురాలి కావల్సి ఇంటిని నిర్మాణం చేయటానికి ముందుకు వచ్చారు. రూ.40వేలతో రేకుల ఇంటిని నిర్మాణానికి మంగళవారం శంకుస్ధాపన చేశారు. ఈసందర్భంగా తిరుమలరావు మాట్లాడుతూ తమ ట్రస్ట్ ద్వారా నిస్సహాయులను ఆదుకోవటం, యువతను చైతన్యవంతం చేసి చేడు అలవాట్ల కు దూరం ఉంచటమే లక్ష్యంతో పని చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి ట్రస్ట్ ద్వారా పేద మహిళలు వేయి మందికి చీరలు పంపిణి చేశామని, యువతకు క్రీడా పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్‌నాయక్ సహకారంతో మరింత సేవా కార్యక్రమాలు నిర్వహణకు ఉపక్రమిస్తున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు గుడిపుడి నర్సయ్య, గేటుకారేపల్లి ఉపసర్పంచ్ కందుల శ్రీనివాసరావు, గ్రామపెద్దలు జక్కుల కుమార్, షేక్ హజేమియా, చెరుకూరి రామారావు, కాకాటి సుదర్శన్, సామినేని తిరుపతిరావు, మందా రామారావు, వల్లభినేని చంద్రశేఖర్, కాకాటి పృద్వీ, బండ మల్లయ్య, పొట్లకాయల మహేష్ తదితరులు పాల్గొన్నారు.








