కారేపల్లి, మహా : కారేపల్లి మండలంలో ఇద్దరు జీపి వర్కర్లు మంగళవారం వడదెబ్బకు మృతి చెందారు. దుబ్బతండా గ్రామపంచాయతీ మల్టిపర్సర్ వర్కర్ బానోత్ రమేష్ (39) మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ లో ఉన్న భార్య పిల్లల వద్ద వెళ్ళి వస్తుండగా వడ్డదెబ్బతగిలి వాంతులు అయ్యాయి. అలాగే ఇంటికి వస్తున్న క్రమంలో పూల్లురు గ్రామం వద్ద సృహతప్పి బండి మీద నుండి క్రిందపడిపోయి మృతి చెందాడు. ప్రమాదాన్ని గమనించిన చట్టుపక్కల వారు అసుపత్రికి తరలించేయత్నం చేయగా అప్పటికే మృతి చెందాడు. రేలకాయలపల్లికి చెందిన పాయం వెంకటనర్సయ్య(54) కు వడ దెబ్బతగిలి మూడు రోజులు ఇంటి వద్దనే చికిత్స పొందుతున్నాడు. పరిస్ధితి విషమించటంతో మంగళవారం మృతి చెందాడు. మృతుడు వెంకటనర్సయ్య కుటుంబానికి తక్షణ సాయం క్రింద రూ.10వేలు సర్పంచ్ తేజావత్ శీరిష రమేష్, ఉపసర్పంట్ జర్పల కస్నా, కార్యదర్శి డీ.రమేష్ లు అందజేశారు.
Post Views: 226








