- దుబ్బ తండాలో
ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు - జాతీయ జెండాను ఆవిష్కరించిన సర్పంచ్ మత్రు నాయక్
కారేపల్లి, మహా:దశాబ్దాల కల తెలంగాణ స్వరాష్ట్రం కల నెరవేరిన రోజు జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను దుబ్బ తండా గ్రామపంచాయతీ పరిధిలో సర్పంచ్ మాత్రు నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మత్రు నాయక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు.అధికారుల సూచనల మేరకు గ్రామంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.తెలంగాణ కవులు, కళాకారులు,ఉద్యమకారుల పట్ల రేవంతన్న సర్కార్ సానుకూలంగా స్పందించి పథకాల అమలులో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా ఎంతోమంది నిరుపేదల సొంతింటి కల నెరవేరుతున్నందుకు పేద లబ్ధిదారులు,ప్రజలందరూ ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రఘు,గ్రామపంచాయతీ సిబ్బంది బిల్ తి, రవి, హిట్లర్ గ్రామస్తులు, గ్రామపంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు








