కారేపల్లి, మహా : కారేపల్లి మండలంలోని గేటుకారేపల్లి, రేగులగూడెం, భాగ్యనగర్తండా గ్రామపంచాయతీలలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్ధిదారుల గృహప్రవేశాలను మంగళవారం నిర్వహించారు. గేటుకారేపల్లిలో జరిగిన కార్యక్రమంలో ఎంపీడీవో మల్లెల రవీంద్రప్రసాద్, ఏఈ నాగేంద్రబాబు, సోసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు, సర్పంచ్ పూసం ఎల్లయ్యలు రిబ్బన్ కట్ చేసి ఇందిరమ్మ ఇండ్ల ప్రవేశాలు చేయించారు. రేగులగూడెంలో సర్పంచ్ ఈసం మోతీరస్వామి, డైరక్టర్ అడ్డగోడ ఐలయ్యలు కొబ్బరికాయలు కొట్టి గృహప్రవేశాలు చేయించారు. భాగ్యనగత్తండాలో సర్పంచ్ బానోత్ హీరాలాల్ లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించారు.ఈకార్యక్రమంలో గుడిపుడి ట్రస్ట్ చైర్మన్ గుడిపుడి తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 144








