*ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవడం మన బాధ్యత*
*బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్*
*బిఎల్ఓలకు ఎన్యుమరేషన్ ఫారమ్స్ అందజేసిన బీజేపీ నాయకులు*
మహా,వరంగల్ ;
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైన ఆయుధమని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ అన్నారు.
వరంగల్ తూర్పు నియోజకవర్గం, పెరుకవాడ 33వ డివిజన్ పరిధిలోని ప్రతాపరుద్ర కమ్యూనిటీ హాల్, మహాత్మా గాంధీ కమ్యూనిటీ లో బీజేపీ జిల్లా కార్యదర్శి మంద శ్రీనివాస్, జిల్లా నాయకులు మెంగని నరేష్ ఆధ్వర్యంలో ఓటర్ ప్రత్యేక సవరణ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ హాజరై, డ్రైవ్ సరళిని పరిశీలించారు.
ఈ సందర్భంగా గంట రవికుమార్ మాట్లాడుతూ, కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్ల సవరణ, కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 33వ డివిజన్ పరిధిలో కొత్తగా ఓటు హక్కు వచ్చే యువతీ యువకులకు, అలాగే మార్పులు చేర్పులు ఉన్న స్థానిక ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఈ ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు ముద్ద సాని కృష్ణ , బిఎల్ఎ, బిఎల్ ఓ, స్థానిక ఓటర్లు పాల్గొన్నారు.








