- తమ వార్డు అభివృద్ధి కోసం నిరాహార దీక్షకైనా సిద్ధం.!
- నేలపై కూర్చుని నిరసన తెలిపిన బిజెపి కౌన్సిలర్
- తమ ప్రతిపాదనను తొలగించారంటూ ఆరోపణ!
- ఆగ్రహం వ్యక్తం చేసిన కౌన్సిలర్ సిద్ధం భానుప్రియ
ఇబ్రహీంపట్నం ఆగస్టు 01 మహా:
మున్సిపాలిటీ సమావేశంలో తమ ప్రతిపాదనను తొలగించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కౌన్సిలర్ సిద్ధం భానుప్రియ. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో శనివారం జరిగిన సర్వసభ్య సమావేశంలో 18వ వార్డు బిజెపి కౌన్సిలర్ సిద్ధం భానుప్రియ తమ వార్డు అభివృద్ధికి కోసం ప్రతిపాదన చేయడంతో, కౌన్సిల్ సమావేశంలో ప్రతిపాదనను జాబితా నుంచి తొలగించారని తీవ్రంగా ఆరోపించారు. దీంతో ఆమె సమావేశ మందిరంలోనే నేలపై కూర్చుని నిరసన తెలిపారు. తమ వార్డులో కుమ్మర సంఘం భవన నిర్మాణం కోసం 20 లక్షలతో ప్రతిపాదించినట్లు చెప్పారు. కుమ్మర సంఘం భవనానికి నిధులు కేటాయించలేదంటే, మున్సిపల్ కార్యాలయం ముందు నిరాహార దీక్షకు సిద్ధమని, కౌన్సిలర్ సిద్ధం భానుప్రియ హెచ్చరిచారు.








