Mahaa Daily Exclusive

  కుడా చైర్మన్ గా గుండు సుధారాణి బాధ్యతలు…

Share

  • కుడా చైర్మన్ గా గుండు సుధారాణి బాధ్యతలు
  • శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేటర్లు, అధికారులు

హనుమకొండ, మహా ;

హనుమకొండ పట్టణంలోని కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ కార్యాలయంలో శనివారం కుడా చైర్మన్ గా గుండు సుధారాణి, ప్రజా ప్రతినిధులు కుటుంబసభ్యుల సమక్షంలో శనివారం ప్రమాణ స్వీకారం చేసి అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయూబ్ అలీ, హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకన్న, గుండు సుధారాణి కి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ మరింత ప్రగతిపథంలో పయనించే విధంగా, ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో మౌలిక సదుపాయాల కల్పన, పట్టణాభివృద్ధి పనులు వేగవంతం చేసే దిశగా కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గుండు ప్రభాకర్, డాక్టర్ లయన్ ఆడెపు రవీందర్, కుడా అధికారులు, బల్దియా అధికారులు, ఏసిపి దేవేందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు, రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.