- డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్‌ఎస్ మద్దతు
- దక్షిణాది రాష్ట్రాల 24 శాతం వాటాను కాపాడాలి: కేటీఆర్
హైదరాబాద్, మహా:
డీలిమిటేషన్ బిల్లుకు భారత రాష్ట్ర సమితి మద్దతు ప్రకటిస్తోంది. మా పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తారు. మహిళా రిజర్వేషన్లకు బీఆర్‌ఎస్ ఎప్పుడూ మద్దతు ఇస్తూనే ఉంది. మహిళలకు చట్టసభల్లో 33 శాతం ప్రాతినిధ్యం కల్పించాలన్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం.
అయితే నియోజకవర్గాల పునర్విభజన పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకూడదు. పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాలకు ప్రస్తుతం ఉన్న 24 శాతం ప్రాతినిధ్య వాటాను తప్పనిసరిగా కాపాడాలి. జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాలు రాజకీయంగా నష్టపోయే పరిస్థితి రాకూడదు.
50 శాతం సీట్ల పెంపు ప్రతిపాదన అమల్లోకి వస్తే తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 17 లోక్‌సభ స్థానాలు 26కు పెరుగుతాయి. రాష్ట్రానికి అదనంగా 9 స్థానాలు వస్తాయి. సీట్ల పెంపుతో పాటు దక్షిణాది రాష్ట్రాల ప్రస్తుత ప్రాతినిధ్య వాటాకు కూడా రక్షణ కల్పించాలి.
మహిళా రిజర్వేషన్లకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. అదే సమయంలో దక్షిణాది రాష్ట్రాల హక్కులు, ప్రయోజనాలను కాపాడటం కూడా అంతే ముఖ్యం.








