Mahaa Daily Exclusive

  విధులను అడ్డుకోవద్దు….

Share

విధులను అడ్డుకోవద్దు.
• జర్నలిస్టులుపై పోలీసుల దాడులు.
• సుప్రీంకోర్టు ఆగ్రహం.
న్యూఢిల్లీ, మహా.
జర్నలిస్టులు, న్యాయవాదులపై ఇటీవల జరిగిన పోలీసు దాడుల వ్యవహారాన్ని సుప్రీంకోర్టు అత్యంత తీవ్రంగా పరిగణించింది. విధి నిర్వహణలో ఉన్న వారి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై అత్యున్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసుల దాడులను సవాల్ చేస్తూ ‘ఫ్రీ స్పీచ్ కలెక్టివ్’, ‘నెట్‌వర్క్ ఆఫ్ విమెన్ ఇన్ మీడియా ఇండియా’ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా జర్నలిస్టులు, లాయర్లపై పోలీసులు ప్రదర్శించిన దురుసు ప్రవర్తనను న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. ప్రజాస్వామ్యంలో కీలక పాత్ర పోషించే పత్రికా ప్రతినిధులు, న్యాయవాదుల విధులను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకోవద్దని పోలీసులను సుప్రీంకోర్టు హెచ్చరించింది. చట్టబద్ధమైన తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్న వారిపై భౌతిక దాడులకు దిగడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఈ దాడుల ఘటనపై పూర్తి వివరణ ఇచ్చేందుకు స్వయంగా కోర్టు ముందు హాజరుకావాలని ఢిల్లీకి చెందిన ఓ సీనియర్ పోలీసు అధికారికి అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.