అమరావతి, మహా : ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. నవంబర్ 3న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలను రీషెడ్యూల్ చేశారు. దీంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్, ఓట్ల లెక్కింపు తేదీల్లో మార్పులు జరిగాయి.
నవంబర్ 5న పోలింగ్.. 7న కౌంటింగ్..
కొత్త షెడ్యూల్ ప్రకారం నవంబర్ 5న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 7న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు. అవసరమైన ప్రాంతాల్లో నవంబర్ 6న రీపోలింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 3న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉండటంతో పోలీసు బందోబస్తు, ఎన్నికల సిబ్బంది కేటాయింపులో ఇబ్బందులు తలెత్తకుండా ఈ మార్పులు చేసినట్లు సమాచారం. కొత్త షెడ్యూల్‌తో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు చేపట్టనున్నారు.








