- సినీ జూనియర్ ఆర్టిస్టుల మధ్య గొడవ కత్తితో దాడి!
- వెంకటగిరి వాటర్ ట్యాంక్ సమీపంలో ఘటన
- యువకుడి పరిస్థితి విషమం
- ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
బంజారాహిల్స్, మహా : జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది. వెంకటగిరి వాటర్ ట్యాంక్ సమీపంలో మంగళవారం రాత్రి 10.41 గంటల సమయంలో ఓ యువకుడిపై కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో నేపాల్‌కు చెందిన విశాల్ (25) తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి రాము (25), డానిష్ (32)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాము, డానిష్, విశాల్ ముగ్గురూ స్నేహితులు. సినిమా పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్టులుగా పనిచేస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో ముగ్గురూ మద్యం మత్తులో ఉన్నారు. ఈ క్రమంలో రాము, డానిష్ కలిసి విశాల్‌పై కత్తితో దాడి చేశారు. గొడవకు అసలు కారణం ఏమిటన్నది ఇంకా స్పష్టత రాలేదు. దాడిలో విశాల్ కడుపు, ఛాతీ, వీపు భాగాల్లో కత్తిపోట్లు తగిలాయి. తీవ్రంగా గాయపడటంతో అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితులుగా భావిస్తున్న రాము, డానిష్‌లను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులు, దాడి వెనుక ఉన్న కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ముగ్గురి మధ్య ముందుగా ఏదైనా గొడవ జరిగిందా? మద్యం మత్తులో వివాదం ముదిరిందా? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది.








