హైదరాబాద్, మహా : హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన కేసులో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు హైకోర్టు నిర్ధారించింది. రిజిస్ట్రేషన్ చట్టం-1908లోని సెక్షన్ 22-ఏ ప్రకారం నిషేధిత ఆస్తుల జాబితా నుంచి కొన్ని ప్లాట్లను తొలగించాలన్న వినతిని పరిశీలించాలని గతంలో కోర్టు ఆదేశించింది. 2025 ఆగస్టులో ఇచ్చిన ఆదేశాల ప్రకారం 60 రోజుల్లోగా వినతిని పరిశీలించాల్సి ఉన్నా.. కలెక్టర్ స్పందించకపోవడంతో 2025 అక్టోబర్ 15న కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైన తర్వాతే అధికారులు నోటీసులు ఇచ్చి, 2026 ఫిబ్రవరి 26న వినతిని తిరస్కరించారు. ఆ తర్వాత జులై 8న మరోసారి తిరస్కరణ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ చర్యలను హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. జస్టిస్ కె. లక్ష్మణ్ నేతృత్వంలోని ధర్మాసనం కలెక్టర్‌కు ఆరు నెలల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.2,000 జరిమానా విధించింది. అయితే శిక్ష అమలును నాలుగు వారాల పాటు నిలిపివేసింది.








