కేసీఆర్ గారి నాయకత్వం, అభివృద్ధి సంక్షేమ పథకాల స్ఫూర్తితో బీఆర్ఎస్లో చేరిన మైనార్టీ నాయకులు
ఖైరతాబాద్ నియోజకవర్గం బంజారాహిల్స్ డివిజన్లో హైమద్ ఖాన్ ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు మైనార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఎమ్మెల్యే కాలనీలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ శ్రీ మన్నె గోవర్ధన్ రెడ్డి (MGR) గారి సమక్షంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి నాయకత్వం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, కేటీఆర్ గారి స్ఫూర్తితో బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరినట్లు మైనార్టీ నాయకులు తెలిపారు.
ఈ సందర్భంగా మన్నె గోవర్ధన్ రెడ్డి గారు పార్టీలో చేరిన నాయకులకు గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రామ ప్రభాకర్ రెడ్డి గారు, మాజిత్ ఖాన్, వసీం ఖాన్, ముదసిర్, అమీర్ ఖాన్, హేమంత్ కుమార్, క్షషీల్ తదితరులు పాల్గొన్నారు.







