Mahaa Daily Exclusive

  యదేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన…..

Share

  • యదేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన
  • రియల్ ఎస్టేట్ సంస్థలపై కొరడా ఝళిపించి రెరా
  • పలు నిర్మాణ సంస్థలకు భారీ జరిమానా

హైదరాబాద్, మహా :రియల్ ఎస్టేట్ రంగంలో నిబంధనలు ఉల్లంఘిస్తున్న నిర్మాణ సంస్థలకు తెలంగాణ రెరా షాక్ ఇచ్చింది. ప్రాజెక్టుల పేరుతో కొనుగోలుదారుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి, నిర్మాణాలు పూర్తి చేయకపోవడం, ఫ్లాట్లు, ప్లాట్లు అప్పగించడంలో జాప్యం చేయడం, రిఫండ్ హామీలను అమలు చేయకపోవడంపై తీవ్రంగా స్పందించింది. మంచిరేవులలో రెరా రిజిస్ట్రేషన్ లేకుండా ‘సనాలి ది ఎడ్జ్’ ప్రాజెక్టును ప్రచారం చేస్తున్న ‘సనాలి ఐటీ పార్క్స్’ సంస్థకు ఏకంగా 25 లక్షల రూపాయల జరిమానా విధించింది. 30 రోజుల్లో జరిమానా చెల్లించాలని, రిజిస్ట్రేషన్ పొందే వరకు ప్రకటనలు, బుకింగ్‌లు, విక్రయాలు నిలిపివేయాలని ఆదేశించింది. మరోవైపు ‘ఆదిత్య స్క్వేర్స్‌’కు 17 లక్షలు, ‘త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌’కు 41 లక్షల 85 వేలు, ‘ఎస్‌వీఎం ఆదిత్య హోమ్స్‌’కు 27 లక్షల 16 వేలు, ‘బీవీఆర్ ఇన్‌ఫ్రా’కు 7 లక్షలు, ‘భువన తేజ ఇన్‌ఫ్రా’ప్రాజెక్ట్స్‌కు 26 లక్షల రూపాయలు వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆదేశించింది. ‘వాసవి రియల్టర్స్ ఎల్‌ఎల్‌పీ’కి 49 లక్షల 50 వేల రూపాయలపై ఏడాదికి 10.85 శాతం వడ్డీ చెల్లించాలని స్పష్టం చేసింది. మియాపూర్ ‘అరైన్ ఎమరాల్డ్’ ప్రాజెక్టులో ఫ్లాట్ నంబర్ 502ను తక్షణమే అప్పగించాలని ‘అరైన్ ఇన్‌ఫ్రా’కు ఆదేశించింది. రెరా ఆదేశాలను ఉల్లంఘిస్తే సెక్షన్ 63 ప్రకారం అదనపు జరిమానాలు తప్పవని హెచ్చరించింది. దీంతో నిర్మాణ సంస్థల బాధ్యత, కొనుగోలుదారుల హక్కుల పరిరక్షణపై తెలంగాణ రెరా మరోసారి తన వైఖరిని స్పష్టం చేసింది.