Mahaa Daily Exclusive

  కొడుకు టికెట్ కోసం… మాజీ మంత్రి ప్రయత్నాలు…

Share

 

హైదరాబాద్, మహా
తన తనయుడిని అసెంబ్లీ బరిలో ఎలాగైనా నిలపాలని భావిస్తున్న ప్రతిపక్ష పార్టీకి చెందిన ఓ మాజీ మంత్రి బిజెపి నేతలతో చర్చలు జరిపినట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. తమ పార్టీలో తలుపులు దాదాపు మూసుకుపోవడంతో సదరు మంత్రి పక్కపార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నట్లు, ఆ జాతీయపార్టీకి చెందిన కీలకనేతను కలిసినట్లు ప్రచారముంది. అయితే సదరుసార్టీ కూడా.. ఆ మాజీ మంత్రికి రెడ్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మీరు పార్టీలోకి రండి. బైపోల్ టికెట్ పై హామీ ఇవ్వలేం. అసెంబ్లీ ఎన్నికల్లో సిటీలో ఏదో ఒక చోట అవకాశం ఇస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. రెండుపార్టీల నేతల కలయిక సిటీలో హాట్ డిస్కషన్ గా మారింది.
…..