Mahaa Daily Exclusive

  సమస్యల సరిష్కారం ఎంజీఆర్ పాదయాత్ర…..

Share

  • సమస్యల సరిష్కారం
    ఎంజీఆర్ పాదయాత్ర
  • ఖైరతాబాద్ నియోజకవర్గంలో సరికొత్త రాజకీయం

ఖైరతాబాద్ , మహా : ఖైరతాబాద్ నియోజకవర్గంలో సరికొత్త రాజకీయానికి బీఆర్ఎస్ శ్రీకారం చుట్టింది. ఖైరతాబాద్ నియోజకవర్గం వెంకటేశ్వర కాలనీ డివిజన్ పరిధిలోని సింగారకుంట (చోటు భాయ్ గల్లీ)లో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా చేపట్టినసమస్యలపై సమరం కార్యక్రమంలో భాగంగా బుధవారం ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి , మాజీ కార్పొరేటర్ మన్నె కవిత గోవర్ధన్ రెడ్డి పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు ప్రధానంగా తాగునీటి సరఫరా, డ్రైనేజీ సమస్యలు, వీధి దీపాల సమస్యలను ఎంజీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించిన ఎంజీఆర్, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, పనులను త్వరితగతిన పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయడమే “సమస్యలపై సమరం” కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇమ్రాన్, ఇస్మాయిల్, సిద్ధిక్, షాకీర్, రిజ్వాన్, శౌరి రాజ్, షారుక్ తదితరులు పాల్గొన్నారు.