Mahaa Daily Exclusive

  తిరుప్పరంకుండ్రం కొండపై అడ్డంకులను అధిగమించి వెలిగిన కార్తీక జ్యోతి..! భక్తుల హర్షం..

Share

చెన్నై, మహా : మదురై జిల్లా తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగింది. దీపం వెలిగించే విషయంలో గత కొంతకాలంగా కొనసాగుతున్న వివాదాలు, అడ్డంకుల నేపథ్యంలో కోర్టు ఆదేశాల అనంతరం కొండపై కార్తీక జ్యోతి ప్రజ్వలించింది.

ఈ పరిణామంతో భక్తుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. కార్తీక మాసంలో సంప్రదాయబద్ధంగా నిర్వహించే దీపారాధనకు కోర్టు ఆదేశాలు మార్గం సుగమం చేశాయనే చర్చ జరుగుతోంది.

సుప్రీంకోర్టు ఆదేశాలతో నవంబర్ 28న కొండపై దీపథూన్‌ వద్ద జ్యోతి వెలిగించారు. ఈ కార్యక్రమానికి సుమారు 5 వేల మంది భక్తులు హాజరయ్యారు. కొండపై భద్రతను సీఆర్‌పీఎఫ్‌ పర్యవేక్షించింది.

ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వ తీరుపై విమర్శలు..

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కార్తీక జ్యోతి వెలగడంతో ఈ వ్యవహారం రాజకీయంగానూ చర్చనీయాంశంగా మారింది. కోర్టు ఆదేశాల అమలులో జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ విజయ్ ప్రభుత్వంపై విమర్శకులు మండిపడుతున్నారు. కోర్టు ఆదేశాల ముందు రాజకీయ నిర్ణయాలు నిలవవనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Latest