Mahaa Daily Exclusive

  ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి పోలీసుల ఎన్‌కౌంటర్.. ముగ్గురు నక్సల్స్ మృతి…!

Share

బీజాపూర్‌ జిల్లాలో ఆదివారం ఉదయం భద్రతాసిబ్బందికి, మావోయిస్టులకు మధ్య భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌ లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. డిస్ట్రిక్ట్‌ రిజర్వ్ గార్డ్స్‌, స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌, స్థానిక పోలీసులు సంయుక్తంగా మావోయిస్టుల కోసం సెర్చింగ్ ఆపరేషన్‌ నిర్వహించారు. ఈ క్రమంలో మావోయిస్టులు ఎదురుపడటంతో కాల్పులు జరిగాయి.
మద్దేడు పీఎస్ పరిధిలోని బందిపొరా-కోరెన్‌జోడ్‌ అటవీ ప్రాంతంలో ఈ ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఘటనా ప్రాంతం నుంచి పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. నారాయణపూర్‌ జిల్లాలో కూడా మావోయిస్టుల కోసం పోలీసులు కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారు నక్సల్స్‌కు సంబంధించిన భారీ డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు

Latest