తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది. ఇందు కోసం ఇప్పటికే లబ్ది దారుల నుంచి సేకరించిన దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసింది. అన్ని జిల్లాలకు అర్హుల జాబితా ను పంపింది. గ్రామ, బస్తీ సభల ద్వారా అభ్యంతరాలు స్వీకరించనుంది. ఆ తరువాత 26వ తేదీ నుంచి జారీ ప్రక్రియ ప్రారంభం కానుంది. కార్డుల పైన సీఎం రేవంత్.. మంత్రి ఉత్తమ్ సంతకాలు ఉండేలా నిర్ణయించారు.
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి సర్వం సిద్దమవుతోంది. ఎంతో కాలంగా కొత్త రేషన్ కార్డుల కోసం లబ్దిదారులు వేచి చూస్తున్నారు. తాజాగా ప్రభుత్వం అర్హులైన లబ్దిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. రాష్ట్రవ్యాప్తంగా 6.68 కుటుంబాలు నూతన కార్డులను పొందడానికి అర్హమైనవిగా పౌర సరఫరాల శాఖ ప్రాథమికంగా నిర్ధారించింది. అర్హుల జాబితాను రాష్ట్రంలోని 33 జిల్లాలకు పంపించింది. ప్రభుత్వ నిర్ణయం మేరకు ఈ నెల 20 నుంచి 24 వరకు 4 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, బస్తీ సభలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది.








