తెలుగు ప్రజలకు స్ఫూర్తి ప్రధాత, వారి సంక్షేమం కోసం అనేక సంస్కరణలు తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ అభ్యున్నతే లక్ష్యంగా పనిచేసిన ఘనత కేవలం నటసార్వభౌముడు, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారికే దక్కిందని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారు పేర్కొన్నారు ..
నేడు అన్న నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతిని పురస్కరించుకొని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారు సీనియర్ టీడీపీ నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలతో కలసి ఎన్టీఆర్ భవన్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు.
అదే స్ఫూర్తితో సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ గారు కొనసాగిస్తున్నారని, అందులో భాగంగానే గత ఐదేళ్లలో విశాఖ ఉక్కు మూతపడేలా చేశారని కానీ మన ముఖ్యమంత్రి వర్యులు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించి నేడు విశాఖ ఉక్కు పరిశ్రమకు 11,400 కోట్లు ఆర్ధిక సాయం తీసుకువచ్చారని అందుకు ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలపాలన్నారు…
కళ్యాణదుర్గం ప్రాంతంలో కూడా కొంత మంది ఎక్కడి నుంచో వచ్చి గాలిమరల పేరు చెప్పి రైతులను మోసం చేస్తున్నారని అలాంటి వారిని నమ్మవద్దన్నారు.. రైతులకు కేవలం 2000 రూపాయలు ఇచ్చి అగ్రిమెంట్ రిజిస్టర్ చేసుకోవడం మోసం చేయడమే అని ప్రభుత్వం ఏ కంపెనీకి అయిన భూములు కేటాయించడానికి కొన్ని నిబంధనలు పాటిస్తుందని అలాంటి నిబంధనలు పాటించకుండా కొంతమంది రైతులను మోసం చేస్తున్నారని, రైతులు గమనించి అలాంటి వారిని నమ్మవద్దని తెలిపారు..
అనంతరం ఆర్డీటీ ఆసుపత్రి, ప్రభుత్వ ఆసుపత్రులలో ఉన్న రోగులకు టీడీపీ సీనియర్ నాయకులు, కూటమి నాయకులతో కలసి రోగులకు పండ్లు, బ్రెడ్లను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారు పంపిణీ చేశారు…








