Mahaa Daily Exclusive

  వైసీపీకి మరో బిగ్ షాక్.. బీజేపీలోకి కనుమూరి రవిచంద్రారెడ్డి…!

Share

రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ (YSRCP)కి రాష్ట్ర ప్రజలు చుక్కలు చూపించారు. ఆ పార్టీని కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం చేస్తూ ఎవరూ ఊహించని తీర్పునిచ్చారు. దీంతో కూటమి ప్రభుత్వం అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈ క్రమంలోనే వైసీపీ (YSRCP)లో ఏదో తెలియని అనిశ్చితి నెలకొంది. గ్రామాల్లో బూత్ లెవల్ కార్యకర్తల నుంచి జిల్లా నాయకులంతా వరుసగా పార్టీలు మారుతున్నారు. ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు (Former Ministers), ఎంపీ (MP’s)లు, ఎమ్మెల్యే (MLA’s)లు సైతం టీడీపీ (TDP), జనసేన పార్టీ్ల (Janasena Party) తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ (YCP)కి మరో షాక్ తగిలింది. ఇవాళ ఆ పార్టీ కీలక నేత కనుమూరి రవిచంద్రారెడ్డి (Kanumuri Ravichandra Reddy) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇవాళ ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, మంత్రి సత్య కుమార్ యాదవ్ సమక్షంలో బీజేపీలో చేరారు. అనంతరం రవిచంద్రారెడ్డికి వారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Latest