కరీంనగర్ లో జరుగుతున్న మూడవ రాష్ట్ర పోలీస్ క్రీడల్లో వరంగల్ కమీషనరేట్ పోలీసులు అర్చరీ క్రీడలో రికార్డు సృష్టించారు. శుక్రవారంఏకంగా ఐదు పతకాలను సాధించారు. మూడు బంగారు పతకాలతో పాటు ఒక రజితం, ఒక కాంస్యం పతకాన్ని గెలుచుకున్నారు. ఎస్సై అనిల్ 50, 30 మీటర్ల విభాగాల్లో బంగారు పతకాలు సాధించగా, మరో ఎస్సై రాజేందర్ ఒలంపిక్ విభాగంలో సిల్వర్ గెలుచుకోగా, కానిస్టేబుల్ రాహుల్ కాంస్యం పతకాన్ని గెలుచుకున్నాడు.
Post Views: 58








