Mahaa Daily Exclusive

  ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లు రద్దుచేయాలి ఉద్యోగాలు, రాజకీయాల్లో బిసిల అణచివేత వరంగల్ బిసి యుద్దభేరి సభలో – తీన్మార్ మల్లన్న

Share

ఈడబ్ల్యుఎస్ రిర్వేషన్లను వెంటనే రద్దుచేయాలని, దీనివల్ల బిసిలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. వరంగల్ వేదికగా జరిగిన బిసి యుద్దభేరి సభలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగాలు, రాజకీయాల్లో బిసిలు అణచివేతకు గురవుతున్నారన్నారు. బిసిలంతా కలిసికట్టుగా మరో ఉద్యమానికి సిద్దం కావాలని, వచ్చే సారి బిసినే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలన్నారు. కులగణనలో బిసిలు 56శాతం లెక్క తేల్చారని, 2కోట్ల మంది బిసిలు తలుచుకుంటే ఈ రాష్ట్రంలో ఏమైనా చేయొచ్చన్నారు. నాలుగేళ్ళలో బిసిల కాళ్ళదగ్గరకు రాష్ట్రం తెస్తమన్నారు. సభకు వివిధ జిల్లాల నుండి భారీగా హాజరుకాగా, ఎంపీ ఆర్. క్రిష్ణయ్య, మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు, వకుళాభరణం క్రిష్ణమోహన్, పూల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Latest