సంత్ శ్రీశ్రీశ్రీ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి సందర్భంగా హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలోని బంజారా భవన్ లో నిర్వహించనున్న కార్యక్రమం పోస్టర్లను తెలంగాణ లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు మాలోతు నాగు నాయక్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా కమిటీ పక్షాన హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలో ఉన్న బంజారా భవన్ లో ఈనెల15వ తేదీన బంజారాల ఆరాధ్య దైవం శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ ని స్మరించుకుంటూ భోగ్ బండార్ కార్యక్రమం మరియు జయంతి ఉత్సవాలు జరుగుతాయన్నారు. జయంతి కి సంబంధించిన పోస్టర్స్ ఆవిష్కరించడం ఎంతో శుభ పరిణామమని అన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ శాసనసభ్యులు పద్మావతి రెడ్డి, ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్ హాజరున్నారని హుజూర్ నగర్ నియోజక వర్గంలోని అన్ని మండలాల బంజారా నాయకులు, ఉద్యోగులు, ప్రజాసంఘాల నాయకులు యువకులు మరియు మహిళలు కుటుంబ సమేతంగా పాల్గొని కార్యక్రమం జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బచ్చలకూరి బాబు , హుజూర్ నగర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గెల్లి అర్చన రవి హుజూర్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాలోతు సక్రు నాయక్ , హుజూర్ నగర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జున్, ఎల్ హెచ్ పి ఎస్ సూర్యాపేట జిల్లా నాయకులు ధీరావత్ శివ నాయక్, కాంగ్రెస్ పార్టీ హుజూర్ నగర్ పట్టణ నాయకులు కోల్లపూడి యోహాను, హుజూర్ నగర్ నియోజకవర్గ ఎల్ హెచ్ పి ఎస్ నాయకులు మాలోతు సైదా నాయక్ మాలోతు దశరథ నాయక్ మాలోత్ చింటూ నాయక్ మాలోత్ సంతోష్ నాయక్ బానోత్ రమేష్ నాయక్ డి నాగరాజు బి రాము డి నరసింహ ఎస్ అనిల్ భూక్య మాంగు నాయక్, తదితరులు పాల్గొన్నారు.








