ఢిల్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు గుణపాఠమని మెదక్ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. మాజీ మంత్రి కేటీఆర్‌కు దమ్ము ఉంటే 76 అసెంబ్లీ 12 పార్లమెంట్‌ల పరిధిలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడం లేదో చెప్పాలన్నారు. ఢిల్లీ ఎన్నికలకు కేటీఆర్‌కు ఏం సంబంధమని ప్రశ్నించారు. కేటీఆర్‌కు కాంగ్రెస్ మీద అంత ప్రేముంటే బీఆర్ఎస్‌ను కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేయాలని సూచించారు. రాబోయే రోజుల్లో బీజేపీ సత్తా ఏంటో తెలుస్తోందన్నారు. మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేసే మొహం లేని వాళ్లు మాట్లాడితే తాము స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. కేటీఆర్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ అని చెప్పారు. ఢిల్లీ ఎన్నికల్లో రాహుల్ గాంధీకి గాడిదగుడ్డు వచ్చిందని ఎద్దేవా చేశారు. లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఢిల్లీ ఫలితాలే పునరావృతం అవుతాయని రఘునందన్ రావు పేర్కొన్నారు.








