Mahaa Daily Exclusive

  లిక్కర్ స్కామ్ వల్లే కేజ్రీవాల్ ఓటమి- అన్నా హజారే

Share

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సామాజిక కార్యకర్త అన్నా హజారే స్పందించారు. అన్నా హజారే విలేకరులతో మాట్లాడుతూ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అరవింద్ కేజ్రీవాల్ ఇమేజ్ ను పూర్తిగా దెబ్బతీసిందని చెప్పారు. ఆప్ కు తక్కువ ఓట్లు రావడానికి ఈ కుంభకోణమే కారణమని హజారే అన్నారు. రాజకీయాల్లో పోటీ చేసే అభ్యర్థి ప్రవర్తన స్వచ్ఛంగా ఎలాంటి నింద లేకుండా ఎలా ఉండాలని తాను ఎల్లప్పుడూ నొక్కి చెబుతానని అన్నారు. ఇదే విషయాన్ని తాను కేజ్రీవాల్‌కు చెప్పానని, కానీ ఆయన వినలేదని విమర్శించారు. కేజ్రీవాల్ డబ్బు, అధికారంతో మునిగిపోయారని హజారే విమర్శించారు.

Latest