బోర్డ్‌లో భాగం కావడం, ఇతర సభ్యులతో కలిసి నా ఆలోచనలను పంచుకోవడం నిజంగా సంతోషంగా ఉంది. పీఎం మోదీ ఆలోచనలు భారతదేశాన్ని ముందుకు నడిపిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు’’ అని చిరంజీవి అన్నారు. భారత్‌ను గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా మార్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది చివర్లో ‘వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్(వేవ్స్)’ను నిర్వహించనున్న సంగతి తెలిసిందే. దీని కోసం కొందరు ప్రముఖ నటీనటులు, వ్యాపారవేత్తలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమ్మిట్ కోసం వారి నుంచి సలమాలు, సూచనలు తీసుకున్నారు. ప్రధాని మంత్రి ప్రసంగంలో చిరంజీవి పేరు ప్రస్తావన వచ్చింది. నరేంద్రమోదీ ప్రసంగంలో చిరంజీవి పేరు రావడం చాలా సంతోషంగా ఉందంటూ చిరు తన ఆనందాన్ని ట్వీట్ చేశారు. ఇందులో భాగం కావడం ఎంతో ఆనందంగా ఉందని చిరంజీవి తన పోస్ట్‌లో పెట్టారు. ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతోన్న వీడియోను పంచుకున్నారు. అడ్వైజరీ బోర్డ్‌లో భాగం కావడం ఆనందంగా ఉందంటూ మోదీకి ధన్యవాదాలు తెలిపారు.








