Mahaa Daily Exclusive

  నాకు ఎంపీ టికెట్‌ రాకుండా అడ్డుకుంది వారే.. సొంత నేతలపై అంజన్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు….!

Share

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఆదర్శనగర్‌లో యాదవ సామాజికవర్గ నేతల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. కులగణన చేపట్టి బీసీ కులాల లెక్కలు తేల్చినందుకు రాష్ట్ర ప్రభుత్వం , సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు చెప్పారు. ‘సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తప్పుడు నిర్ణయం తీసుకున్నది. నిజానికి ఈ సీటును కాంగ్రెస్ పార్టీ యాదవులకు కేటాయిస్తే తప్పకుండా గెలిచేది. యాదవులకు ఇవ్వకుండా పార్టీలోనే కొందరు అడ్డు తగిలారు. యాదవ కులస్తులను కాంగ్రెస్ పార్టీలోని కొందరు ఇప్పటికీ అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు.. తన కొడుకు పార్టీకి చేసిన సేవలను గుర్తించి రాజ్యసభ సీటు ఇచ్చింది. తనకు నేరుగా సోనియా, లాలూ ప్రసాద్ లాంటి వాళ్ళు చెప్పడంతోనే పీసీసీలో చోటు ఇచ్చారని’ అంజన్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ పీసీసీ, మాజీ ఎంపీగా చేసినా ఎక్కడ స్వయంగా నిలబడి ఎన్నికల్లో గెలిచింది లేదని వీహెచ్‌ను ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు.