Mahaa Daily Exclusive

  నేడు కేసీఆర్ కీలక సమావేశం…!

Share

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో జరగనున్న ఈ భేటీలో పార్టీ సభ్యత్వ నమోదు, రజతోత్సవ కార్యక్రమాలు, సంస్థాగత అంశాలతో పాటు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంత మందిని బరిలోకి దింపాలనే అంశంపైనా చర్చిస్తారని తెలుస్తోంది.