Mahaa Daily Exclusive

  ప్రతిపక్షాలపై దర్యాప్తు సంస్థలను ఊసిగొల్పడం దారుణం మోడీవన్నీ కక్ష సాధింపు చర్యలే టీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్..!

Share

సీబీఐ, ఈడీలను బీజేపీ తన జేబు సంస్థల్లా వాడుకుంటుందని, కేవలం ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టేందుకు ఈడీని ఉపయోగించుకుంటున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పేర్లను ఈడీ ఛార్జీ షీట్ లో చేర్చింది. దీనిపై కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ చీఫ్ మహేస్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. ఆదర్శనగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బిఎస్ఎన్ఎల్ కార్యాలయంకు చేరుకున్న కాంగ్రెస్ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చేపట్టిన ర్యాలీలో కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఈ ర్యాలీలో కాంగ్రెస్ నేతలకు మద్దతుగా బీజేపీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన అసమర్థ పాలనను కప్పిపుచ్చుకునేందుకు దర్యాప్తు సంస్థలను ప్రతిపక్షాలపై ఉసి గొల్పుతుందని మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి పదేళ్లు అవుతుందని.. అప్పటి నుంచి దాదాపు 95 శాతం ఈడీ కేసులు అన్నీ ప్రతిపక్షాల పైనే పెడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014 నుంచి ఇప్పటివరకు నమోదైన ప్రతీ 100 కేసుల్లో 95 కేసులు ప్రతిపక్షాలపైనే ఉంటున్నాయని ప్రతిపక్షాల పేర్లు లేకుండా ఈడీ చార్జీ షీట్లు దాఖలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా పత్రికలో మా పార్టీ డబ్బులు పెడితే మనీలాండరింగ్ కేసు పెట్టడం కుట్ర పూరిత చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులకు భయపడేది లేదన్నారు. త్యాగాల కుటుంబం గాంధీ కుటుంబమని, అలాంటి కుటుంబాలపై కుట్రలు చేయడం క్షమించరానిదన్నారు. నేషనల్ హెరాల్డ్ లో ఎలాంటి తప్పు జరగలేదన్నారు. లేనిది ఉన్నట్లుగా ప్రజలకు చూపించి రకాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తుందన్నారు. ఈడీ
అధికారులు తమది స్వయం ప్రతిపత్తి సంస్థ అని మరచిపోయి పని చేయడం దారుణమన్నారు. కోర్టు మీద, ప్రజల మీద కాంగ్రెస్ పార్టీకి పూర్తి నమ్మకం ఉందని, కేంద్రంలోని ఫాసిస్టు ప్రభుత్వం మీద మమేకమై పోరాటం చేస్తామన్నారు. కులం మతం పేరుతో ఈడీ, సీబీఐలను ఉపయోగించుకొని రాజకీయాలు చేస్తున్నారని, కేంద్రంలోని బీజేపీ కక్ష సాధింపు చర్యలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి రోజురోజుకూ ప్రజల్లో ఆధరణ పెరుగుతుందని, దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని మోడీ భయపడి కేసులు పెడుతున్నారన్నారు. దొంగ కేసులు కోర్టులో నిలవవని, తప్పకుండా వీగిపోతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే శ్రీ గణేష్, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.