Mahaa Daily Exclusive

  ఇస్రో మాజీ ఛైర్మన్‌ కస్తూరి రంగన్‌ కన్నుమూత..!

Share

PSLV, జీఎస్ఎల్వీ అభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషించిన ఇస్రో మాజీ ఛైర్మన్‌ డాక్టర్‌ కస్తూరి రంగన్‌ (84) కన్నుమూశారు. బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.1994-2003 వరకు ఇస్రో ఛైర్మన్‌గా పనిచేశారు. 2003-09 మధ్య రాజ్యసభ సభ్యుడిగానూ ఉన్నారు. 2004 నుంచి 2009 మధ్య కాలంలో బెంగళూరులోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌కు డైరెక్టర్‌గా పనిచేశారు.