Mahaa Daily Exclusive

  భగ్గుమన్న ఖమ్మం ప్రజలు . – పెహల్గాం ఉగ్రదాడిపై విరుచుకుపడిన బీజేపీ – పాక్ జెండా కాలితో తొక్కి నిరసన …!

Share

ఖమ్మం, ఏప్రిల్ 30.మహా.

జమ్ము కాశ్మీర్‌లోని పెహల్గాం ప్రాంతంలో చోటుచేసుకున్న ఉగ్రదాడిపై ఖమ్మం ప్రజలు భగ్గుమన్నారు. బుధవారం నాడు నగరంలోని వైరా రోడ్డులో ఉన్న తనిష్క్ జువెలరీ సమీపంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విస్తృతంగా నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పాకిస్తాన్ జెండాను కాలితో తొక్కుతూ “ఉగ్రవాదాన్ని నశింపజేయాలి”, “పాక్ మూర్ఖత్వానికి చివరిరోజు దగ్గరపడింది” అంటూ నినాదాలు గుప్పించారు.

తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యదర్శి కొల్లూ మాధవి, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భద్రతా దళాలపై జరిగే దాడులను సమాజం తట్టుకోదని, భారత్‌ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తే పాకిస్తాన్ మూల్యం చెల్లించాల్సిందేనని హెచ్చరించారు. “ఇది పాక్ అసమర్థ నాయకత్వానికి పరాకాష్ట. ప్రశాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్‌లో ఉద్ధృతిని రెచ్చగొట్టే కుట్రకు ఇది నిదర్శనం. కేంద్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తుంది. ఈ దాడికి పాల్పడిన వారిని వదిలే ప్రసక్తే లేదు” అని కొల్లూ మాధవి ఘాటుగా స్పందించారు.
ఈ నిరసన కార్యక్రమంలో గుత్తా వెంకటేశ్వరరావు, మంద సరస్వతి, వేల్పుల సుధాకర్, నీరుకొండ ఉషారాణి, నల్లగట్టు ప్రవీణ్ కుమార్, గుగులోతు నాగేశ్వరరావు, అల్లిక అంజయ్య, విజయరెడ్డి, అనిత, దొడ్డ అరుణ, బండారు నరేష్, తోడుపునూరి రవీందర్, రవి రాథోడ్, నెల్లూరు బెనర్జీ, గడీల నరేష్, అంకతి పాపారావు, కుమిలి శ్రీనివాస్, మాధవ్, మణి, కొమ్మ మధు, దాసు, రజనీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు