ఆదిలాబాద్, మహా :
రోడ్డు ప్రమాదంలో గాయపడి రిమ్స్ లో చికిత్స పొందుతున్న ఉట్నూర్ మండలం ఎంక గ్రామానికి చెందిన బూర్ల నరేష్ ను కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి పరామర్శించారు. సోమవారం సాయంత్రం ఆసుపత్రికి వెళ్లిన అయన ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అయన వెంట నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి, డేరా కృష్ణ రెడ్డి,బూర్ల శంకరయ్య, దాసరి ఆశన్న, రఫిక్ తదితరులు ఉన్నారు.
Post Views: 35







