రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా.
తెలంగాణా ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ఇబ్రహీంపట్నం ప్రజా భవన్ కార్యాలయంలో జాతీయ జెండాను ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అమరుల త్యాగాల ఫలితమేనని ఆయన కొనియాడారు. నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించి రాష్ట్ర ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నేడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ప్రజా పాలన కొనసాగుతుందని ఆయన అన్నారు. సాధించుకున్న స్వరాష్ట్రంలో ప్రజల ఆకాంక్షను నెరవేర్చుకునేలా ప్రజా పాలన కొనసాగుతుందని తెలిపారు. ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి, ప్రజల కోసం అనేక పథకాలు అమలు చేయడం జరుగుతుందని ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే 500 కే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి ఉచిత కరెంటు, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, ప్రస్తుతం ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేయడం జరిగిందన్నారు. యువత కోసం యువ వికాసం పేరిట నాలుగు లక్షల వరకు అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గురునాథ్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ పాండురంగారెడ్డి, ఇబ్రహీంపట్నం పోలీస్ ఇన్స్పెక్టర్ ఐ జగదీష్, మున్సిపల్ కమిషనర్ రవీందర్ సాగర్, కాంగ్రెస్ పార్టీ నేతలు వింజమూరి ప్రేమాకర్ రెడ్డి, భూపతి గల్ల మహిపాల్, ముత్యాల రాజశేఖరరావు, మంకాల దాసు, రాచర్ల వెంకటేశ్వర్లు, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.







