రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల ఆవరణంలో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన గౌరవ ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డికి పోలీసులు గౌరవ వందనంతో జిల్లా యంత్రాంగం తరపున ఘన స్వాగతం పలికారు. అనంతరం గౌరవ ముఖ్యమంత్రి సలహాదారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
జిల్లా ప్రజలనుద్దేశించి గౌరవ ముఖ్యమంత్రి సలహాదారు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, రాష్ట్ర అభివృద్దే అమరులకు అసలైన నివాళి అని అన్నారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో జిల్లాలో అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని వివరించారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఆప్యాయంగా పలుకరిస్తూ, అమరవీరుల కుటుంబాలను సత్కరించారు.
జిల్లా జీవన జ్యోతి మహిళ సమాఖ్యకు 80 కోట్ల 02 లక్షల, 89 వేల చెక్కును, మెప్మా ద్వారా జిల్లాలోని 385 మహిళా సంఘాలకు 50 కోట్ల రుణాల పంపిణీ చెక్కును గౌరవ ముఖ్యమంత్రి సలహాదారు అందజేశారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో పాఠశాలల నుండి వచ్చిన చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరింపజేశాయి. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించిన చిన్నారులకు మెమోంటోలు గౌరవ ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి అందజేశారు.
తెలంగాణ అమరవీరులకు శ్రద్హాంజలి ఘటించిన గౌరవ ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, కలెక్టర్, ప్రజాప్రతినిధులు.
అంతకుముందు కలెక్టరేట్ ఆవరణలో అమరవీరుల స్మారక స్థూపం వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, ఎస్పీ సునీత రెడ్డి, అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి, వీర్లపల్లి శంకర్, ఆర్డీఓ సంగీత తదితరులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అమరవీరుల త్యాగాల పునాదులపై, పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు అన్ని రంగాలలో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని ముఖ్య అతిధి అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల స్పూర్తితో తెలంగాణ ప్రగతిలో అన్ని వర్గాల ప్రజలు మమేకం కావాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పలువురు రైతులకు నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేశారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్బంగా ఏర్పాటు చేసిన వివిధ శాఖలకు సంబంధించి స్టాల్స్ ను సందర్శించారు.
ఈ వేడుకల్లో రాష్ట్ర పట్టణ,ఆర్థిక మౌలిక సదుపాయాల అభివృద్ది సంస్థ ఛైర్మన్ చల్లా నర్సింహ రెడ్డి, శాసన సభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి, వీర్లపల్లి శంకర్, కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, రాచకొండ పోలీస్ అధికారి, జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, డీఆర్ఓ సంగీత, జిల్లా పరిషత్ సీఈఓ కృష్ణారెడ్డి, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్ రెడ్డి, జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Post Views: 147







