వరంగల్ మహా;
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వరంగల్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఐఎంఏ భవనంలో జరిగిన వేడుకల్లో వైద్యులు, ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఐఎంఏ వరంగల్ అధ్యక్షుడు డాక్టర్ కే నాగార్జునరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనేది ప్రజల సమిష్టి కృషి ఫలితమని ఈ పర్వదినాన్ని ప్రతి సంవత్సరం జరుపుకోవడం గర్వకారణం అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జాతీయ పతాకావిష్కరణ అనంతరం జాతీయ గీతం ఆలపించారు. అనంతరం తెలంగాణ ఉద్యమంలో ఆనాడు వరంగల్ ఐఎంఏ పాత్ర ను గుర్తు చేసారు. అనంతరం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వరంగల్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ అజిత్ మహమ్మద్ మాట్లాడుతూ సాధించుకున్న
తెలంగాణ ను ఆరోగ్య తెలంగాణ గా మార్చాలని జిల్లాలోని వైద్యులందరు
ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ వైద్యులు డాక్టర్ కాళీ ప్రసాద్ రావు, డా విజయ చందర్ రెడ్డి, డా నాగేంద్ర బాబు, డా అశోక్ రెడ్డి, డాక్టర్ బందెల మోహన్ రావు, డా మోహన్ రావు, డా మల్లేశం డా కస్తూరి ప్రమీల, డా జనార్దన్, డా శేషు మాధవ్, డా ప్రవీణ్, డా కొత్తగాట్టు శ్రీనివాస్,
జనరల్ సెక్రటరీ డా అజిత్ మహమ్మద్, ఫైనాన్స్ సెక్రటరీ డా శిరీష్ కుమార్, ప్రెసిడెంట్ఎలక్ట్ డా. మన్మోహన్ రాజు,
తెలంగాణ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు.







