రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
సామాజిక రుగ్మతల నుంచి మానవాళిని జాగృతపరుస్తూ సన్మార్గంలో నడిపించేందుకు అల్లాహ్ భూమిపైకి 80 వేల మంది ప్రవక్తల్ని పంపినట్లు ఖురాన్ చెబుతోంది. వారిలో ఒకరు ప్రవక్త హజరత్ ఇబ్రహీం. అయితే, జీవనాన్ని
సన్మార్గంలో గడపాలని ప్రవక్తలు మానవాళికి బోధిస్తున్న క్రమంలోనే వారి విశ్వాసాన్ని కూడా అల్లాహ్ అనేక రకాలుగా పరీక్షించేవారు. ఈ క్రమంలో ప్రవక్త ఇబ్రహీం చిరస్థాయిగా నిలిచిపోవడానికి అల్లాహ్ మరో పరీక్ష విధించాడు. తన కొడుకును బలివ్వమని కోరాడు. ఈ విషయాన్ని తన కుమారుడైన ఇస్మాయిల్ సంతోషంగా అంగీకరించడంతో అతడిని బలిచ్చేందుకు మీనా కొండ వద్దకు తీసుకెళ్తాడు. అక్కడ కళ్లకు తెల్లని గుడ్డ కట్టుకుని కుమారుడిని శిరచ్చేధనకు కత్తి ఎత్తగానే చలించిపోయిన అల్లాహ్. ఇస్మాయిల్ స్థానంలో గొర్రె పొట్టేలును ఉంచాడు. ఇస్మాయిల్ సజీవంగా కనిపించడంతో ఇబ్రహీం ఆశ్చర్యానికి గురయ్యాడు. త్యాగానికి పరాకా నిలిచిన ఇబ్రహీం జీవితాన్ని స్మరించుకుంటూ ముస్లింలు బక్రీద్ పర్వదినాన్ని జరుపుకుంటారు.
బక్రీద్ ఆచరణ..!
ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం జిల్ హజ్ పర్వదినాన్ని జరుపుకుంటారు. ఖుర్బానీ చేసిన అనంతరం ముస్లింలు హజ్రత్ ఇబ్రహీం మాదిరిగానే దైవప్రీతి కోసం తమ ధనాన్ని, ప్రాణాన్ని సమస్తమూ త్యాగం చేయడానికి సిద్ధమేనని నిరూపించుకుంటారు. ఖుర్బానీ ఇస్లాం అబలలోఒక ముఖ్యమైనదని దైవ ప్రవక్త మహమ్మద్ (సతానం) 3 ఆదేశించాడు. బక్రీద్ రోజున ముస్లీంలు నమాజ్ చేసిన అనంతరం ఖుర్బానీ (మాంసం) ఇస్తారు.
ఖుర్బానీతో లాభాలు..!
బక్రీద్ పండుగ రోజున ఖుర్బానీ ఇచ్చే ముస్లిం సోదరులకు ఎంతో పుణ్యఫలం లభిస్తుందట. ఖుర్బానీ ఇచ్చేవారికి జంతువులపై ఉండే వెంట్రుకలకు పది రెట్లు పుణ్యఫలాలు దక్కుతాయన్నది సారాంశం. ఖుర్బానీ ఇచ్చే అతను తను ” బలి చేసే జంతువు రక్తం భూమి మీద పడకముందే తాను చేసిన పాపాలకు మోక్షం లభిస్తుందని వారి నమ్మకం. పండగ రోజు నమాజ్ అనంతరం ఆర్థిక స్థోమత ఉన్న వారంతా విధిగా ఖుర్బానీ ఇవ్వాలి. అందు కోసం పూర్తిగా ఒక
సంవత్సరం నిండిన ఆరోగ్యకరమైన మేక లేదా గొర్రె ఏదైనా దైవ మార్గంలో సమర్పించాలి.








