Mahaa Daily Exclusive

  భారతదేశ దశ దిశను మార్చిన తెలుగు తేజం పీవీ నరసింహరావు సేవలు చిరస్మరణీయం మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ యాటగీత..!

Share

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:

దేశ ప్రధానిగా దివంగత పీవీ నరసింహరావు అనేక ఆర్థిక సంస్కరణలు, సాహసోపేత నిర్ణయాలతో, ప్రపంచంలోనే భారత్ బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు, ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ యాటగీత, జిల్లా ఎంపీటీసీల సంఘం మాజీ అధ్యక్షుడు గూడూరు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం కడ్తాల్ మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీవీ చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాల వేసి ఘన నివాళులర్పించి, అయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…
భారతదేశ దశ దిశను మార్చిన తెలుగు తేజం, మాజీ ప్రధాని పీవీ నరసింహరావు అని, పీవీ ఎంతో ధైర్యంతో 1991లో అమలు చేసిన ఆర్థిక సంస్కరణ వల్లనే దేశం నేడు ఈ స్థితిలో ఉందంటూ వారు కొనియాడారు. విదేశీ మారక ద్రవ్యం నిధులు అడుగంటి పోవడంతో 1991 నాటికి, భారత్ ఆర్థికంగా గడ్డు పరిస్థితులను, ఎదుర్కొంటోందన్న, ఆ సమయంలో ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన పీవీ నరసింహారావు సాహసోపేతంగా సంస్కరణలు అమలు చేశారన్నారు. ఆనాటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ తో కలిసి అనేక సంస్కరణలు అమలు చేయడం వల్ల భారత్ నేడు ఆర్థికంగా ఒడిదుడుకులు లేని స్థితిక చేరుకోగలిగిందన్నారు. ఆయన సేవలు చిర స్మరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి బీక్యానాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బీచ్యానాయక్, సింగిల్విండో డైరెక్టర్ వెంకటేశ్, నాయకులు యాదగిరిరెడ్డి, సత్యంయాదవ్, బిక్కునాయక్,శంకర్, యాదయ్యగౌడ్, రమేశ్ గౌడ్, షాబుద్దీన్, ప్రవీణ్, శ్రీశైలం, బానుకిరణ్,చందు, అశోక్, మోత్యా, ఫణీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.