Mahaa Daily Exclusive

  మహా న్యూస్‌పై దాడిని ఖండించిన నారా లోకేశ్..!

Share

AP: హైదరాబాద్ మహా టీవీ హెడ్ ఆఫీసుపై దాడిని ఏపీ మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు. ప్రజావాణి వినిపించే మీడియాపై దాడి ప్రజాస్వామ్యంపై దాడిగానే పరిగణించాలన్నారు. మహా టీవీ పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. కథనాలు, ప్రసారాల పట్ల అభ్యంతరాలు ఉంటే, తెలియజేయాలి కానీ, ఇటువంటి దాడులు క్షమార్హం కాదన్నారు. అలాగే మహా యాజమాన్యానికి సంఘీభావం తెలిపారు.