Mahaa Daily Exclusive

  మహా న్యూస్‌పై దాడి.. ఖండించిన సీపీఐ నారాయణ..!

Share

మహా న్యూస్‌ ఛానెల్‌పై BRS కార్యకర్తలు దాడి చేయడంపై సీపీఐ నేత నారాయణ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో మీడియా కీలకమని, బీఆర్ఎస్ ఉద్యమానికి ఊపిరిపోసిన మీడియాపై దాడి నీచమైన చర్య వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ తప్పు ఒప్పుకోవాలని లేదా దాడితో తమకు సంబంధం లేదని చెప్పాలని డిమాండ్ చేశారు. మౌనంగా ఉంటే ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలో భాగమవుతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.