ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనతోపాటు పార్టీ నేతలపై అడ్డగోలుగా దుష్ప్రచారం చేస్తున్న వారిని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. అబద్ధాలు అసత్యాలు దురుద్దేశపూర్వక ప్రచారాలు చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవన్నారు. కొంతమంది వ్యక్తులు మీడియా ముసుగులో దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కావాలని కొన్ని మీడియా సంస్థలు, కొంతమందితో జట్టు కట్టి ఒక ముఠాగా మారి చేస్తున్న దుష్ప్రచారంపై చట్టపరంగా తగిన సమాధానం చెబుతామన్నారు.
Post Views: 85







