మహా భద్రాచలం
భద్రాచలం సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ( ఐ టీ డి ఏ ) ద్వారా మిల్లెట్ బిస్కెట్స్ తయారు చేసి జాతీయ స్థాయిలో గుర్తింవు పొందడం ఫై ప్రధాని మోదీ అభినందించారు. ఐ టీ డి ఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్ ప్రత్యేక ప్రణాళికలు ద్వారా గిరిజన మహిళలకు ఉపాధి కల్పించేందుకు శిక్షణ ఇప్పించి చిరు ధాన్యాలతో బిస్కెట్స్ తయారీ యూనిట్స్ నెలకొల్పారు. ఈ బిస్కెట్స్ అతి తక్కువ ధరలో ఆరోగ్యానికి మేలు చేసేవి కావడంతో తక్కువ సమయంలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయు. ఈ విధంగా గిరిజన మహిళలు తమ కాళ్ళఫై తాము నిలబడి వ్యాపారం చేస్తూ ఖ్యాతి గడించడాన్ని భారత ప్రధాని మోదీ మన్ కీ బాత్ లో ప్రస్తావించారు. ఆదివారం భద్రాచలం వచ్చిన కలెక్టర్ జితేష్ వి పాటిల్ బిస్కెట్స్ తయారీ యూనిట్స్ పరిశీలించి పి ఓ రాహుల్, గిరిజన మహిళలను అభినందించారు.
Post Views: 118








