Mahaa Daily Exclusive

  సేవాకార్యక్రమాలతో బాలిక పూజితకు నివాళులు.. మొక్కలు నాటిన మాజీ సర్పంచ్ శీలం కోటారెడ్డి….!

Share

తల్లాడ, జులై, 30( మహా):-

రెండు రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడిన బాలిక పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలతో నివాళులర్పించారు. తల్లాడ మండలం రామానుజవరం గ్రామంలో రెండు రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడిన అయిలూరి పూజిత పుట్టినరోజు సందర్భంగా ఆదివారం కుటుంబ సభ్యులు, స్థానిక ప్రముఖులు, ఉపాధ్యాయులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.కళాశాల హాస్టల్లో ఉండడం ఇష్టం లేక శుక్రవారం రాత్రి పురుగు మందు తాగి పూజిత ఆత్మహత్యకు పాల్పడింది.ముందుగా పూజిత చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పూజిత జ్ఞాపకార్థం మొక్కలు నాటారు.స్థానిక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా నోట్ బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు.కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శీలం కోటారెడ్డి, మాజీ వైస్ ఎంపిపి శీలం శివపార్వతి, స్థానిక ప్రముఖులు శీలం శ్రీనివాసరెడ్డి, శీలం నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.