Mahaa Daily Exclusive

  బుడమేరు రిటైనింగ్ వాల్ పూర్తయింది: మంత్రి నిమ్మల

Share

AP: గతేడాది విజయవాడను బుడమేరు ముంచెత్తిన విషయం తెలిసిందే. ఇళ్లు నీట మునిగి వేలాది మంది ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దాంతో ప్రభుత్వం అప్పటికప్పుడే బుడమేరుకు పడిన గండిని పూడ్చింది. శాశ్వతంగా రిటైనింగ్ వాల్‌ నిర్మాణం చేపట్టింది. 365 మీటర్ల రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తయిందని మంత్రి నిమ్మల రామానాయుడు తాజాగా ప్రకటించారు. దీనికి రూ.23 కోట్లు చేశామన్నారు. అలాగే రూ.1.8 కోట్లతో వెలగలేరు రెగ్యులేటర్‌కు 12 కొత్త గేట్లు అమర్చామన్నారు.